మంథని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల  పై నెగ్గిన అవిశ్వాసం...

మంథని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల  పై నెగ్గిన అవిశ్వాసం...
  • మంథని మున్సిపల్ రాజకీయం ఉత్కంఠ రేపగా..
  • అవిశ్వాస తీర్మానంలో మాత్రం కౌన్సిలర్లే విజయం సాధించారు.
  • మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ లపై అవిశ్వాసం నెగ్గినట్లు మంథని ఆర్డీఓ హనుమాన్ ప్రకటించారు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: ఉత్కంఠ రేపిన మంథని మున్సిపల్ రాజకీ కియానికి స్థిరపడింది మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమారులపై అవిశ్వాసం పెట్టేందుకు  ఈ నెల 1వ తేదీన మంథని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల పై పెద్దపల్లి జిల్లా పాలన ధికారికి అవిశ్వాస తీర్మాన కాపీని ఇచ్చిన కౌన్సిలర్ లు,  అనంతరం నేటి వరకు ప్రత్యేక శిబిరానికి తరలి వెళ్లారు. శుక్రవారం మంథని మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ హనుమా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిలర్ లు  వ్యతిరేక తీర్మాన సమావేశంలో  పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ లకు వ్యతిరేకంగా కౌన్సిలర్ లు చేతులు లేపారు. దీంతో అవిశ్వాస తీర్మానంను ఇద్దరు కాంగ్రెస్ 7 గురు బీఆర్ఎస్  కౌన్సిలర్ లు అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నారు.  చైర్మన్, వైస్ చైర్మన్ ల పై అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మీడియా డివిజన్ కన్వీనర్ ఇనుముల సతీష్, కాంగ్రెస్ నాయకులు ముసుకుల సురేందర్ రెడ్డి, పోతారం సర్పంచ్ జాగిరి సదానందం యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.