కమాన్ పూర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్

కమాన్ పూర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్

ముద్ర, రామగిరి:- కమాన్ పూర్ ఎస్సైగా మామిడాల చంద్రశేఖర్ బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన బేతి రాములు భీమారం పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో గోదావరిఖని టూ టౌన్ లో ఎస్సైగా పని చేస్తున్న మామిడాల చంద్రశేఖర్ కమాన్ పూర్ కు వచ్చారు. 2014లో ఎస్ఐగా ఉద్యోగంలో చేరి చొప్పదండి, హుజురాబాద్, హాజీపూర్, చెన్నూరు, గోదావరిఖని టూ టౌన్ లలో ఎస్ఐగా పని చేశారు. ఇప్పుడు బదిలీపై వచ్చి కమాన్ పూర్ లో బాధ్యతలు స్వీకరించారు.. పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్ఐ బాలాజీ నాయక్, హెడ్ కానిస్టేబుల్ రహీం, వీరేశం, తిరుపతి, ఖలీల్ సిబ్బంది జంగిలి రమేష్, బాలకృష్ణ, శ్రీలత, అశోక్, సతీష్, అంజలి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.