మంథని గోదారి నదిలో స్నానానికి పోటెత్తిన భక్తులు.. ట్రాఫిక్ జామ్ 

మంథని గోదారి నదిలో స్నానానికి పోటెత్తిన భక్తులు.. ట్రాఫిక్ జామ్ 

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: దీపావళి పండుగను పురస్కరించుకొని గోదావరి నది స్నానానికి భక్తులు శనివారం ఉదయం నుంచే పోటెత్తారు. మంథని నియోజక వర్గం నుంచే కాకుండా పెద్దపల్లి జిల్లా నలుమూల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి స్నానానికి మంథనికి  రావడంతో మంథని పట్టణం నుంచి గోదావరి వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వాహనాలను మంథని బస్ డిపో నుంచి శ్రీపాద కాలనీ వరకు అనుమతించినప్పటికీ ప్రజల రద్దీ ఎక్కువగా ఉండటంతో వాహనాలు గోదావరి వరకు పోలేక మధ్యలోనే దింపుడు కళ్ళం వద్ద నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా గోదావరి నది వరకు భక్తులు నడుచుకుంటు ప్రయాణించే విధంగా ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు పుణ్య స్థానాలు చేసి గోదారి నదిలోనే గంగమ్మ తల్లికి పూజలు చేసి,  గోదావరి ఒడ్డున ఉన్న గౌతమేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని దర్శించుకొని తిరిగి వస్తున్నారు. 

మంథని సీఐ గడిగొప్పుల సతీష్ అధ్వర్యంలో ఎస్సై కిరణ్  ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఎక్కడికక్కడ పోలీస్ లతో బందోబస్తు ఏర్పాటు చేశారు.