రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించే స్థాయి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు లేదు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించే స్థాయి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు లేదు
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ విమర్శిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు
  • కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అటు రాష్ట్రం ఇటు తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయి
  • ఈనెల 11న మరో గ్యారంటీ పథకం ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం

తుంగతుర్తి ముద్ర: రాష్ట్రంలో గడచిన పది సంవత్సరాలలో పేద ప్రజలకు ఏ ఒక్కరికి ఇల్లు నిర్మించిన చరిత్ర బి.ఆర్.ఎస్ పార్టీకి లేదని ఏ  గ్రామంలో చూసిన గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లే కనిపిస్తున్నాయని తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామెల్ అన్నారు. ఆదివారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న  బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వాన్ని  బిఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించడం సూర్యుని మీద ఉమ్మి వేయడం లాంటిదేనని అన్నారు .అభివృద్ధి నిరోధకులు అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం అది కాక స్థాయిని మరిచి విమర్శించడం ఎంత మాత్రం తగదని హెచ్చరించారు .

ఈనెల 11న ఎన్నికల హామీలు భాగంగా  ఇందిరమ ఇళ్ల నిర్మాణాన్ని పేద ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ కానుకగా ఇవ్వనుందని ఎమ్మెల్యే అన్నారు .ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇప్పటికే ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారని గృహజ్యోతి 500 కుగ్యాస్ సిలిండర్ల పథకాలను అమలు చేయడం తక్షణమే అవి అమల్లోకి రావడం జరిగిందని అన్నారు. నేడు మరో పథకాన్ని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలులోకి తీనున్నారని అన్నారు. తాను తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కట్టుబడి ఉన్నారని మోత్కూర్ డిగ్రీ కాలేజ్ తిరుమలగిరి జూనియర్ కాలేజ్ మంజూరి చేయించడం జరిగిందని త్వరలో వాటిని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.

అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా కుంటుబడిపోయిన రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా తుంగతుర్తి మానాపురం రోడ్డు 15 కోట్లతో నిర్మాణం చేయనున్నామని అలాగే తిమ్మాపురం సంగం కోడూరు రోడ్లను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు .అన్నిటికీ మించి తుంగతుర్తి మండలం వెలుగు పల్లి రుద్రమదేవి రిజర్వాయర్ గా చేయడానికి రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి నివేదిక అందించామని ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తుందని చేసేదే చెప్తుందని ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అన్నారు. రానున్న కాలంలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.