పెద్దపల్లి లో కాంగ్రెస్ కార్యకర్త లు సైనికుల పనిచేయాలి  కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ రమణారావు 

పెద్దపల్లి లో కాంగ్రెస్ కార్యకర్త లు సైనికుల పనిచేయాలి  కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ రమణారావు 

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపెల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సైనికుల పనిచేసే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకుంట విజయ రామణరావు అన్నారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు విజయరామరావు సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు, జూలపల్లి మండలం, వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన వారితో పాటు తదితరులు,  అలాగే పెద్దపల్లి మండలం, కొత్తపల్లి గ్రామనికి చెందిన తదితరులు, సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వార్డు సభ్యులు నాయకులు,: కార్యకర్తలు  తదితరులకు  విజయరమణరావు  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికి వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.