నేడే మంథని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక

నేడే మంథని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
  • మంథని మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండ్రు రమాదేవి ...?
  • మంత్రి ఆశీర్వాదాలతో పాటు  కౌన్సిలర్ల మద్దతు కూడా రమాదేవికే...?

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: ఎంతో ఉత్కంఠ మధ్య దాదాపు రెండు నెలలు కొనసాగిన మంథని మున్సిపల్ చైర్ పర్సన్ అవిశ్వస రాజకీయాలకు నేడు చెక్కుబడనుంది.  సోమవారం మంథని మున్సిపల్ చైర్ పర్సన్  ఎన్నిక జరగనుంది. ఉదయం  మంథని మున్సిపల్ చైర్మన్ ను కౌన్సిలర్లు ఎన్నుకోనున్నారు. మంథని రాజకీయాలు ఎవరు ఊహించని విధంగా మలుపు  తీరగడంతో గత 10 సంవత్సరాలుగా 5 ఏండ్లు మంథనిలో సర్పంచ్ గా,  5 ఏండ్లు మున్సిపల్ చైర్ పర్సన్ గా ఏకచిత్రాధిపత్యంగా  కొనసాగుతున్న పుట్ట శైలజను  ఊహించని విధంగా అవిశ్వాసం పెట్టి తన కౌన్సిలర్లే పదవి నుంచి తొలగించారు.  నేడు జరగనున్న చైర్మన్ ఎన్నికల్లో కౌన్సిలర్లు, చైర్మన్ గా మళ్లీ ఎవరిని ఎన్నుకుంటారో అని మంథని ప్రజలు ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. 

చైర్మన్ గా రమాదేవికి ఛాన్స్...? 

మంథని మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండ్రు రమాదేవి కి అవకాశం దక్కనున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా  పనిచేస్తున్న పెండ్రు సురేష్ రెడ్డి సతీమణి రమాదేవి కౌన్సిలర్  గా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. శ్రీధర్ బాబుకు అత్యంత నమ్మకస్తులుగా కష్ట కాలంలో వెన్నంటే ఉన్న సురేష్ రెడ్డి దంపతులకు చైర్మన్ పదవి దక్కే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ నెల 16వ తేదీన అవిశ్వాసం పెట్టి. చైర్మన్ వైస్ చైర్మన్ లను పదవి నుంచి తొలగించగా అధికారులు చైర్మన్ ను ఎన్నుకునే తేదీని నేడు 18 తేదిని ప్రకటించారు. దీంతో  మంత్రి శ్రీధర్ బాబు అశీర్వాదాలు,  కౌన్సిలర్ల మద్దతు ఉండటంతో,  మంథని రెండో చైర్మన్ గా రమాదేవి కే అదృష్టం వరించనున్నట్లు తెలుస్తోంది.