సింగరేణి కార్మికుల అలవెన్స్  పై ఇన్కమ్ టాక్స్ యాజమాన్యమే చెల్లించాలి

సింగరేణి కార్మికుల అలవెన్స్  పై ఇన్కమ్ టాక్స్ యాజమాన్యమే చెల్లించాలి
  •    రామగుండం, మంథనిలో సింగరేణి అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయాలి
  •    సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ని కలిసి కోరిన ఐన్ టీయూసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్

 ముద్ర పెద్దపల్లి ప్రతినిధి: సింగరేణి లో అధికారుల కు చెల్లించే విధంగా ప్రకృతి కి విరుద్ధంగా ప్రమాదకరమైన పరిస్థితులలో పని చేస్తున్న  కార్మికులకు చెల్లించే అల్లవెన్స్ ల పై  ఇన్ కమ్ టాక్స్ ను యాజమాన్యమే చెల్లించే లా చర్యలు తీసుకోవాలని సింగరేణి సంస్థ సి అండ్ ఎం డి బలరాం నాయక్ ల ను కలిసి కోరటం జరిగిందని ఐ ఎన్ టి యు సి జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ తెలిపారు . సింగరేణి లో ఉద్యోగులకు రూ. 18000 -27000 వరకు  పేర్క్ స్ మీద 20-30 % ఆదాయపు పన్ను విదించ బడుతుందని , కోల్ ఇండియా లో ఇది యాజమాన్యమే కార్మికులు రీఅంబర్స్మెంట్ చేస్తుందని , అదే విధంగా సింగరేణి లో అధికారులకు దాదాపు 50 %  అలవెన్స్  మీద  ఇన్ కమ్ టాక్స్ యాజమాన్యమే చెళ్ళించినపుడు కార్మికులకు  కూడా యాజమాన్యమే చెల్లించే లా చర్యలు తీసుకోవాలని, అధికారులకు వారు చెల్లించే దానితో పోల్చుకుంటే కార్మికులకు చెళ్ళించేది చాలా తక్కువ అని వారు తెలిపారు.

అదే విధంగా  రామగుండం పరిసర ప్రాంతాల్లో సింగరేణి అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయాలని సంబంధిత పరిశ్రమల మంత్రి  శ్రీధర్ బాబు  ఈ విషయం పై సానుకూలంగా ఉన్నారని  అనుబంధ సంస్థపై  సమగ్ర నివేదిక రూపొందించాలని కోరారు, దీని ద్వారా రామగుండం, మంథని పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారవుతమని, సింగరేణి అనుబంధ సంస్థలు నెలకొల్పి సింగరేణి కి అవసరమైన ముడి సరకులు మనమే తయారు చేయటం వల్ల రవాణా ఖర్చు తగ్గి  కోట్ల రూపాయలు అదా అవుతుందని అన్నారు. వీటికి సీఎండి  సానుకూలంగా స్పందించారని తెలిపారు.