బీఆర్ఎస్ మ్యాని ఫెస్టో తో ప్రతిపక్షాలు షాక్.. పెద్దపల్లి లో ఎగిరేది గులాబీ జెండే

బీఆర్ఎస్ మ్యాని ఫెస్టో తో ప్రతిపక్షాలు షాక్.. పెద్దపల్లి లో ఎగిరేది గులాబీ జెండే

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తో ప్రతిపక్షాలకు షాక్ లో వున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.    గురువారం ఎమ్మెల్యే  స్వగృహంలో పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన  గుండేటి నరేష్ ఆధ్వర్యంలో  పెద్ద సంఖ్యలో యువకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి  కేసీఆర్ మరోసారి రైతు, మహిళ, నిరుపేదల పక్షపాతి అని  నిరూపణయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ ఎద్దు కుమారస్వామి, నాయకులు శ్రీకాంత్, అజయ్, వంశీ, శ్రీకాంత్, తదితరులను పాల్గొన్నారు.