హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రాజీనామా

హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రాజీనామా

హుజూర్ నగర్ టౌన్ ముద్ర: హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్  పర్సన్ దొంతగాని లక్ష్మమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, బి ఆర్.యస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ముడెం గోపిరెడ్డి,   కౌన్సిలర్ దొంతగాని పద్మ,  మాజీ కౌన్సిలర్ రవి నాయక్, మలి దశ ఉద్యమ కారుడు కడియాల రామ కృష్ణ, వేపల సింగారం ఉప సర్పంచ్ తో పాటు పలువురు వార్డు మెంబర్ లు, పరపతి సంఘం డైరెక్టర్లు గురువారం బి.ఆర్.యస్ పార్టీకి రాజీనామ చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నియంత పోకడలే రాజీనామకు కారణం అని తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ గా, వైస్ చైర్మన్ గా, చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించానని, కార్యకర్తల ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్  ప్రకటిస్తానని అన్నారు.