సంగ్యం గ్రామ బంధం పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి - అన్నపర్తి జ్ఞానసుందర్

సంగ్యం గ్రామ బంధం పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి - అన్నపర్తి జ్ఞానసుందర్

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం లోని పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలమయమై సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్న పాలకులకు చీమకుట్టినట్లయినా లేదని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్నపర్తి జ్ఞానసుందర్ అన్నారు. జోరున కురుస్తున్న వర్షంలో సంగ్యం- కోడూరు రోడ్డుపై బ్రిడ్జి లేక ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీటి వద్ద నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు .గతంలో ఇదే వాగులో రైతులు కొట్టుకుపోయారని నోరులేని మూగజీవాలు వరదలకు కొట్టుకుపోయాయని అన్నారు .వెలుగుపల్లి - కేశవాపురం రోడ్డు మధ్యలో వర్షం నీటి  ప్రవాహం  ఉదృతంగా ప్రవహించడంతో కేశవాపురం వాసులకు రాకపోకలు బంద్ అయ్యాయని అన్నారు గతంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు వాగులపై బ్రిడ్జి లు వేయాలని ప్రజలు కోరారని బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని చెప్పిన నేటి వరకు అలాంటి పనులేవీ ప్రారంభం కాలేదని తిరిగి ప్రజలు రైతులు నా ఇబ్బందులు పడుతున్నారని  అన్నారు.

ఇకనైనా పాలకులు స్పందించి తక్షణమే వాగు నీరు ప్రవహించే ప్రాంతాలలో పైపులు వేసి బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని జ్ఞానసుందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు రైతులు జ్ఞానసుందర్ వెంట ఉన్నారు