ఇక షాద్ నగర్ కాదు- శంషాబాద్ 

ఇక షాద్ నగర్ కాదు- శంషాబాద్ 

శంషాబాద్ ఏసిపి పరిధిలోకి కొత్తూరు, నందిగామ పీఎస్ లు

ఉత్తర్వులు జారి చేసిన అధికారులు

ముద్ర, షాద్‌నగర్ : కొత్తూరు, నందిగామ పోలీస్ స్టేషన్ లు శంషాబాద్ ఏసీపీ పరిధిలో విలీనం అయ్యాయి. పోలీస్ స్టేషన్ల వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర పోలీసు శాఖ చర్యలు చేపట్టిన విషయం విధితమే. ఈ మేరకు ఏసీపీల పరిపాలన సౌలభ్యం కోసం షాద్ నగర్ పరిధిలోని కొత్తూరు, నందిగామ పోలీస్ స్టేషన్లను శంషాబాద్ ఏసీపీ పరిధిలో కలుపుతూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. శంషాబాద్ ఏసీపీ పరిధిలో ఆర్.జి.ఐ, షాపూర్(శంషాబాద్), కొత్తూరు, నందిగామ పోలీస్ స్టేషన్లు పని చేయాల్సి ఉంటుంది.

ఫలించని ప్రయత్నం

కొత్తూరు, నందిగామ పోలీస్ స్టేషన్ల విలీనాన్ని అడ్డుకునేందుకు నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం అధికారుల నిర్ణయాన్ని తప్పుపట్టారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పలుమార్లు ఉన్నతాధికారులను, మంత్రులను కలిసి విన్నవించారు. ఇటీవల నందిగామ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం సమయంలో నేతలు మరోమారు హోమ్ మంత్రి మైమూద్ అలీ, డిజిపి అంజనీ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. అయినా విలీన ప్రక్రియ ఆగలేదు.