పండగలా ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి జన్మదిన వేడుకలు

పండగలా ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి జన్మదిన వేడుకలు
  • దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన మండల పార్టీ అధ్యక్షుడు అంజిరెడ్డి
  • సైధిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలతో మార్మోగిన దర్గా** 

ముద్ర , పాలకీడు: హుజూర్ నగర్ స్థానిక ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాలకీడు మండల 
బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కిష్టపాటి అంజిరెడ్డి ఆధ్వర్యంలో . జాన్పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.తమ నాయకుడు సైదిరెడ్డీ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని,ప్రజాసేవ చేయడానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన మూడు సంవత్సరాల అభివృద్ధి 70 ఏళ్లకు సమానమన్నారు.ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధిలో రాజీపడకుండా తీర్చిదిద్దారని అంజిరెడ్డి స్పష్టం చేశారు .ఒక ప్రజా ప్రతినిధి వుండాల్సిన సంపూర్ణ సేవాగుణం తమ నాయకుడికి వుందన్నారు.ఎవరు ఫోన్ చేసినా స్పందించి సమస్య పరిష్కారం చేసే   నాయకుడు సైధిరెడ్డి అన్నారు.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బారి మెజారిటీతో గెలవడం కాయమని ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే జన్మదినం అంటే నియోజకవర్గ ప్రజలకు పండగలా వుందన్నారు.ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దర్గాలో దట్టిలు కట్టి పూజలు చేశారు.అనంతరం కేక్ కట్ చేసి సైధిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినదించారు..కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు.పార్టీ శ్రేణులు ,అభిమానులు  భారీగా పాల్గొన్నారు..