కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డిని ముందస్తు హౌస్ అరెస్టు చేసిన పోలీసులు

కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డిని ముందస్తు హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
  • బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమ అరెస్టు ను ఖండించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి 
  • కాంగ్రెస్ నాయకుల  అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్న
  • నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదా 
  • బేషరతు గా మా నాయకులను విడిచిపెట్టాలి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తూ స్వంత పార్టీ ప్రచారం చేస్తుందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు గురువారం ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటిలో ఉండే మాట్లాడారు.టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి  ఇచ్చిన పిలుపుమేరకు టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య భవన్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్  దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగిందని ఈ సందర్భంగా అరెస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు చేశారు.

బిఆర్ఎస్ చేసే దుశ్చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు