ఆపద్బాంధవుడు జగదీషుడు

ఆపద్బాంధవుడు జగదీషుడు
  • కార్యకర్త కుటుంబాన్ని అక్కున చేర్చుకున్న మంత్రి
  • రోడ్డు ప్రమాదంలో స్వర్గస్తులైన పాతర్లపాడు కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పెద్దింటి లింగయ్య యాదవ్
  • లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి, చిత్రపటానికి నివాళులు
  • నేనున్నానంటూ భరోసా.. అండగా ఉంటానని హామీ
  • లింగయ్య కుటుంభ బాధ్యత నుభుజాన వేసుకున్న మంత్రి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: కుటుంభ పెద్దన్న కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ఆపద్బాంధవుడు అయ్యాడు సూర్యాపేట శాసనసభ్యులు ,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి. కష్టాలలో నేనున్నానంటూ భరోసా ఇచ్చి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆత్మకూరు మండలం పాతర్లపాడు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పెద్దింటి లింగయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్వర్గస్తులయ్యారు. ఆయన మరణంతో భార్య, ఇద్దరు పిల్లలు దిక్కుతోచని స్థితిలో శోక సంద్రంలో మునిగారు.  విషయం తెలుసుకున్న మంత్రి తనకోసం పనిచేసిన లింగయ్య కుటుంబానికి అండగా ఉండాలనే నెపంతో నేరుగా పాతర్లపాడు కి వెళ్లి లింగయ్య చిత్రపటానికి నివాళులర్పించడంతోపాటు ఆయన భార్యా పిల్లలకు ప్రగాఢ సంతానం వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయం చేశారు. పిల్లల చదువు బాధ్యత తనదే  అంటూ హామీ ఇచ్చారు.

ఇంటర్ పాసైన లింగయ్య భార్యకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం  ఇస్తానని  హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ లింగయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుడి నరసింహారావు, ఎంపీపీ మర్ల చంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, బత్తుల ప్రసాద్, బ్రహ్మం గౌడ్ తదితరులు ఉన్నారు.