ప్రయివేట్ వద్దు ప్రభుత్వమే ముద్దు

ప్రయివేట్ వద్దు ప్రభుత్వమే ముద్దు
  • అదే బాటలో కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ

ముద్ర ప్రతినిధి , కోదాడ:-ఇటీవల నూతనంగా కోదాడ కు బదిలీపై వచ్చిన ఆర్డీఓ సూర్యనారాయణ నిర్ణయం సంచలనమైనది . మధ్య తరగతి కుటుంబాలు సైతం పిల్లల చదువుల కోసం వేలు , లక్షలు ఖర్చు చేస్తున్న ఈ రోజులలో , ఉన్నత ఉద్యోగంలో ఉన్న సూర్యనారాయణ తన ఇద్దరు కుమారులను ప్రయివేట్ వద్దని ప్రభుత్వ విద్యాలయాలలోనే చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు . తన పెద్ద కుమారుడు షణ్ముఖ నాయుడు ని కోదాడలోని కెఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఆర్ట్స్ గ్రూప్ లో చేర్పించగా , తన ద్వితీయ కుమారుడు యోషిద్ నాయుడు ను కోదాడ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (బాయ్స్ హైస్కూల్ ) లో 10 వ తరగతి నందు జాయిన్ చేశారు . ఇలా ఒక ఆర్డీఓ నే తన పిల్లలను ప్రభుత్వ కళాశాల , పాఠశాలలో జాయిన్ చెయ్యటంతో మరింతమంది పేరెంట్స్ కు ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకం కుదురుతుందని ఇది తమకు ఎంతో ఆనందమని ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు , ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ తానూ కూడా ప్రభుత్వ పాఠశాల , కళాశాలలోనే విద్యను అభ్యసించానని , ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు విద్య కోసం ఖర్చు చేస్తున్నాయని వాటిలో ఎంతో గొప్ప నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు విద్యను భోదిస్తున్నారని అనవసరంగా ప్రయివేట్ మోజులో పడి డబ్బులు వృధా చేసుకోవద్దని అన్నారు.