జనాభా ప్రతిపదికన  అన్ని రంగాలలో బీసీలకు వాటా దక్కాలి..

జనాభా ప్రతిపదికన  అన్ని రంగాలలో బీసీలకు వాటా దక్కాలి..
  • భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు బీసీ జపం చేసే విధంగా చేస్తాం...
     
  • బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు..


 ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు బీసీ జపం చేసే విధంగా  కార్యక్రమాలు నిర్వహిస్తామని,బీసీల జనాభా ప్రాతిపదికన బీసీ లకు  విద్యా, ఉద్యోగ  మరియు చట్టసభలలో  దక్కే విధంగా ఉద్యమిస్తామని  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హాన్మాండ్లు అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం  జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరవేని మల్లేష్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ముఖ్యఅతిథిగా పర్శ హన్మాండ్లు హాజరై, మాట్లాడుతూగౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ గౌడ్ ఈ మధ్యలో కొందరిపై మాట్లాడిన మాటలపైన నేను స్పందిస్తున్న క్రమంలో కొంత చర్చ జరిగిన మాట వాస్తవంమని  అన్నారు.ఇద్దరు మధ్యలో ఏమైనా బేధాభిప్రాయాలు ఉంటే కూర్చుండి చర్చించుకుందాం అని సామాజిక మాధ్యమం లో గోవర్ధన్ గౌడ్ తెలిపిన విషయం దృష్ట్య, అదేవిధంగా బీసీల భవిష్యత్తు లో రాజకీయ ఎదుగుదల దృష్ట్యా గోవర్ధన్ గౌడ్, నా మధ్యలో జరిగిన చర్చకు, కౌంటర్ ప్రతి కౌంటర్లకు పులిస్టాప్ పెడుతున్నట్టు  అన్నారు. కొందరు  ఇదే అవకాశంగా గోవర్ధన్ గౌడ్ ను ప్రక్క దోవ పట్టిస్తూ  బీసీల ఐక్యతను దెబ్బతీసే విధంగా కుతంత్రాలు పన్నుతున్నారని,ఇదంతా మేము  గ్రహించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అన్నారు. గోవర్ధన్ గౌడ్ ను తప్పు దోవ పట్టిస్తున్నా, వ్యక్తులను గోవర్ధన్ గౌడ్ దూరం పెట్టాలని అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో  యాదవ, గౌడ ,ముదిరాజ్, మున్నూరు కాపు, కులస్తులకు కోట్ల విలువైన రెండు ఎకరాల స్థలమును కేటాయించడం పట్ల  హర్షం వ్యక్తం చేసారు. ఈ  సందర్బంగా  మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ,బీసీ సంక్షేమ సంఘం పక్షాన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే సర్కిల్ ఏర్పాటు చేసి, జ్యోతిబాపూలే విగ్రహాన్ని ప్రతిష్టింపజేయాలని మంత్రి కేటీఆర్ కు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి కీ విజ్ఞప్తి చేశారు. 

బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల  రవి గౌడ్ లు మాట్లాడుతూ పర్శ హన్మాండ్లు తన 30 ఏళ్ల బీసీ ఉద్యమంలో అనేక త్యాగాలు చేసినారని,అనేక అవమానాలు ఎదుర్కొని బీసీల కొరకు రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చిన చరిత్ర పర్శ హన్మాండ్లు దే అన్నారు. జిల్లా కేంద్రంలో బీసీల కొరకు మంత్రి కేటీఆర్ ను ఒప్పించి మెప్పించి బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేసిన ఘనత  పర్శ హన్మాండ్లు కే దక్కుతుంది అని  అన్నారు. బీసీ స్టడీ సర్కిల్లో ఇప్పుడు వేలమంది శిక్షణ తీసుకుంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి రామా గౌడ్,నాయకులు కంచర్ల రాజు ,అంజయ్య గౌడ్, నాగరాజు గౌడ్, తిరుపతి, సుజిత్, ప్రశాంత్, శ్రీధర్ తదితరు పాల్గొన్నారు.