సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి ప్రతీక: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి ప్రతీక: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర సిరిసిల్ల టౌన్;సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీకని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సిరిసిల్లలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.