అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన : ఎంపిపి పిల్లి రేణుక కిషన్

అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన : ఎంపిపి పిల్లి రేణుక కిషన్

ముద్ర,ఎల్లారెడ్డిపేట:  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో  అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఎంపిపి పిల్లి రేణుక కిషన్  సందర్శించారు.అంగన్వాడీ కేంద్రం లో మొత్తం 27  మంది విద్యార్థులుండగా  గురువారం 14 మంది విద్యార్థులు మాత్రమే హాజర య్యారు. వారి కోసం వండిన వంటలను  ఎంపిపి పిల్లి రేణుక కిషన్ పరీశీలించారు. మోను ప్రకారం విద్యార్థులకు గురువారం ఉడకబెట్టిన కోడిగుడ్లు  ఇస్తామని అంగన్వాడీ టీచర్ పద్మ తెలిపారు.వేసవికాలం ఎండలు మండుతున్నందున  విద్యార్థులను అంగన్వాడీ కేంద్రాన్ని వచ్చేటప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోని పంపాలని ఆయా బాల్ లక్ష్మీ ని ఎంపిపి పిల్లి రేణుక ఆదేశించారు.అక్కడ సర్పంచ్ మంగోళీ నర్సాగౌడ్, ఎంపిటీసీ సభ్యులు సింగారం మధు  , సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఉప సర్పంచ్ ఉస్మాన్ బాయి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు వాసరవేణి దేవరాజు, గొల్ల పెల్లి సురేష్ ,గనగోని భంటీ గౌడ్,గఫర్ బాయి , శ్రీనివాస్ ,మంగోళీ రాజు ,దేవరాజు , తదితరులు పాల్గొన్నారు.