పర్యవరణ పరిరక్షణ మనందరి బాధ్యత - జిందం కళాచక్రపాణి

పర్యవరణ పరిరక్షణ మనందరి బాధ్యత - జిందం కళాచక్రపాణి

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: పర్యవరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి పిలుపునిచ్చారు. బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో  స్వచ్ఛ సర్వేక్షన్ 2023లో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ సెహార్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు.అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు కౌన్సిలర్లు, అధికారులు స్వచ్ఛ ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులతో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య స్వచ్చ్ సర్వేక్షన్ ప్రతిజ్ఞ ను చేయించారు.