ముదిరాజులది త్యాగాల చరిత్ర...

ముదిరాజులది త్యాగాల చరిత్ర...
  • రాజ్యాధికారంలో ముదిరాజులకు వాటా దక్కాలి...
  • ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్శ హన్మాoడ్లు

ముద్ర, గంభీరావు పేట :ముదిరాజులది త్యాగాల చరిత్ర అని,త్యాగాలకు దగ్గట్లు జనాభా ప్రతిపదికన ముదిరాజులకు రాజ్యాధికారంలో వాట దక్కాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్శ  హన్మండ్లు అన్నారు.  గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటలో ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా పర్శ  హన్మండ్లు హాజరయ్యారు. అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే  జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి,నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పర్శ  హన్మండ్లు మాట్లాడుతూ ముదిరాజుల చిరకాల వాంఛ అయిన బీసీడీ గ్రూపులో నుండి బీసీఏ గ్రూపులోకి మార్చాలనిప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర జనాభాలో 50 లక్షల మంది ముదిరాజులు ఉన్న, విద్యా, ఉద్యోగ, రాజకీయంగా,  ఆర్థికంగా ఇప్పటికీ వెనుకబడి ఉన్నారని,ముదిరాజుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యమత్యంగా ఉండి పోరాటం చేయాలని అన్నారు.

ముదిరాజుల సమస్యలను శాసనమండలి వైస్ చైర్మన్,  ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. బీసీ కమిషన్  ముదిరాజుల జీవనస్థితిగతులపై అధ్యాయం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే,  విద్యా ఉద్యోగాల్లో  న్యాయం జరుగుతుందని అన్నారు.సీఎం కేసీఆర్ రాష్ట్రంలో తరగతుల కోసం అనేక గురుకులాలు ఏర్పాటు చేసి,  ఒక్కొక్క విద్యార్థిపై సుమారు లక్ష రూపాయల పైనేఖర్చు చేస్తున్నాడని,ఈ అవకాశాన్ని ముదిరాజులు వినియోగించుకోవాలని అన్నారు.మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నాడని,  ప్రతి కుటుంబం ఏదో రకంగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతుందని తెలిపారు.  ముదిరాజుల కోసం ముదిరాజ్ ఫెడరేషన్, ముదిరాజ్ బంద్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  ఈ  కార్యక్రమం లో ముదిరాజ్ గ్రామ శాఖ అధ్యక్షుడు మెతుకు రాజు,గే రిగంటి పెద్ద బాల నర్సు, ముదిరాజ్ మండల అధ్యక్షుడు రమేష్,ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్,  ఆర్బిఎస్ కోఆర్డినేటర్ రాజేందర్,  మాజీ ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవ్వ,  నాయకులు పిట్ల శ్రీమతి,శివానంది దేవేందర్,అంబటి దేవయ్య,నాగారపు దేవేందర్,అరిగి రమేష్,కిషన్,సుతారి నరేష్,మెతుకు మాంకాళి,  ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.