తెలంగాణలో మూడోసారి వచ్చేది కెసిఆర్ సర్కారే

తెలంగాణలో మూడోసారి వచ్చేది కెసిఆర్ సర్కారే

హోం శాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడి

మద్దూర్ లో ఇఫ్తార్ విందుకు హాజరైన హోం శాఖ మంత్రి మహమూద్ అలీ 

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: రాష్ట్రంలో ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలే బి.ఆర్.ఎస్ పార్టీని తిరిగి మూడోసారి అధికారంలోకి తీసుకువస్తాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ధీమా వ్యక్తం చేశారు.  సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని తాజ్ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఆరిఫోద్దిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న హోం శాఖ మంత్రి మహమూద్ ఆలి  పై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ హాజరై ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు రాష్ట్ర అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నారని మహమూద్ అలీ కొనియాడారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడ  లేవని చెప్పారురైతులకు 24 గంటల ఉచిత కరెంటు తో పాటు సాగునీరు, తాగనీరు ,పెట్టుబడి సాయంగా రైతుబంధు ,రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్న గొప్ప  నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.

మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట కమిషనర్ శ్వేత ,ఏసిపి సతీష్  మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం, మద్దూర్ ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి , కొమురవెల్లి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు లాల్ బాగన్, నవాజ్ పటేల్, మద్దూరు దూల్మిట్ట మండలాల బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేక సంతోష్ కుమార్  మంద యాదగిరి  . మజీద్ కమిటీ అధ్యక్షుడు షకీల్ అహ్మద్,  ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు , మైనార్టీ నాయకులు  పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ఈ కార్యక్రమం ఇఫ్తార్ విందు జరిగింది.