పోచమ్మ దేవాలయంలో చోరీ 

పోచమ్మ దేవాలయంలో చోరీ 

సిద్దిపేట, ముద్ర  ప్రతినిధి: సిద్దిపేటలోని సుభాష్ నగర్ లో ఉన్న పోచమ్మ దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగింది. ఆలయంలోని రెండు గల్లా పెట్టెలను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. గత రాత్రి సిద్దిపేటలో భారీ వర్షం కురవడం సిద్దిపేటలో విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ఇదే అదునుగా భావించి దొంగలు దేవాలయ గేట్లను కోసివేసి, గల్లా పెట్టెల తాళాలు విడగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో చోరీ జరిగిన విషయమై దేవాలయ కమిటీ అధ్యక్షుడు బాపురెడ్డి స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని వారు సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.