జులై 5న గజ్వేల్ నుండి యూత్ సందేశ్ బస్సు యాత్ర

జులై 5న గజ్వేల్ నుండి యూత్ సందేశ్ బస్సు యాత్ర

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డక ఇంటికో ఉద్యోగం,నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను మోసగించిన కెసిఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుధవారం నాడు ఆయన పర్యటించారు. ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ యువ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో నిర్వహించారు. శివసేనారెడ్డి మాట్లాడుతూ వచ్చే జూలై 5వ తారీఖు నాడు యూత్ సందేశ యాత్ర పేరుతో బస్సు యాత్రను గజ్వెల్ నుండి ప్రారంభించబోతున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గం గజ్వేల్ నుండి యాత్ర ప్రారంభిస్తున్నామని ఈ యూత్ సందేశ యాత్రలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులను, నిరుద్యోగులను సీఎం మోసం చేసాడని, రాష్ట్రంలో మూడున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని , నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగుల నుండి లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

మహిళ కానిస్టేబుల్ నియమకాలలో యూత్ కాంగ్రెస్ పెద్ద సంఖ్యలో ఉద్యమం చేస్తే గర్భిణీలకు ఈవెంట్స్ రద్దు చేశారని తెలిపారు. 2018 మేనిఫెస్టో లో పొందు పర్చిన నిరుద్యోగ భృతి మూడువేల పదహారు రూపాయలు నిరుద్యోగులకు ఇవ్వకుండా ఎలాగో తుంగలో తొక్కరో రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ ,ఇంటర్ పాసైన విద్యార్థులకు ముఖ్యమంత్రి లక్ష 60 వేల రూపాయలు బాకీ ఉన్నాడని,మూడు నాలుగు మాసాల్లో ఎలక్షన్లు రానున్నాయని ఎలక్షన్ ప్రచారాలలో భాగంగా మీ దగ్గరికి వచ్చే బిఆర్ఎస్ నాయకులను నిలదీయాలని , ముఖ్యంగా యువత మేలుకోవాలన్నారు. 2018లో నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీ దానిని కాపీ కొట్టి ముడువేళపదహరు రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక మోసగించారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసిన యువకులకు నిరాశ ఎదురయిందని అన్నారు.అప్పులు చేసి హాస్టల్లో ఉండి చదువుకుంటూ నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూసి తీరా ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఎంతోమంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం చేసిన మోసాలను యావత్ తెలంగాణ రాష్ట్రంలోని యువతకు , నిరుద్యోగులకు తెలపడం కోసమే యూత్ సందేశ యాత్ర పేరుతో బస్సు యాత్రను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి నాయిని యాదగిరి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు టి. ఆంక్షరెడ్డి , పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు , వహీద్ ఖాన్, గౌడ్ నేత నాగరాజు ,జాకీర్ , టిల్లురెడ్డి , క్యాసారం బాబా, కాంగ్రెస్ పార్టీ నేతలు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.