రైతు బంధు పేరిట ఇన్పుట్ సబ్సిడీ ఎత్తివేసిన సీఎం కేసీఆర్

రైతు బంధు పేరిట ఇన్పుట్ సబ్సిడీ ఎత్తివేసిన సీఎం కేసీఆర్

కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని⁵ నర్సింహారెడ్డి 

సిద్దిపేట:  ముద్ర ప్రతి నిధి : ప్రస్తుత ప్రభుత్వం ఎకరాకు 5 వేల రూపాయలు రైతుబంధు ఇచ్చి గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీలు మొత్తం ఎత్తివేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి,  సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎన్ బాలకృష్ణారెడ్డి లు అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అనేక మంది రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రైతు ఆగ్రహంతోనే కూలి పోవడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే రైతు రాజవుతాడని అన్నారు.వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ కిసాన్ సెల్ బెజ్జంకి మండల అధ్యక్షునిగా రోడ్డ మల్లేశం ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ మీడియా సమావేశంలో రత్నాకర్ రెడ్డి, దామోదర్, వెంకటేశ్వరరావు, శ్రావణ్, రాజు, రాజేందర్ పలువురు పాల్గొన్నారు.