సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి 
                                                           
సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 18 నుండి 25 న ఉదయం 6 గంటల వరకు  సిటీ పోలీస్ యాక్ట్ ఆమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ నేరెళ్ల పల్లి శ్వేతా రెడ్డి తెలిపారు యాక్టు అమలులో ఉన్న సమయంలో కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించ కూడదని తెలిపారు అత్యవసరమైతే కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్  అధికారుల అనుమతి  తీసుకోవాలని సూచించారు.బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా 
వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు.