టెన్త్ రిజల్ట్ లో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా

టెన్త్ రిజల్ట్ లో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా

టెన్త్ రిజల్ట్ లోనూ బాలికలదే పై చేయి

 సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సిద్దిపేట జిల్లాకు రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు లభించింది. జిల్లా నుంచి ఈ సంవత్సరం 14,117 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా,13,985 మంది విద్యార్థులు పదో తరగతి పాసయ్యారు. మొత్తంగా 98.65% శాతం పాస్ రిజల్ట్ వచ్చింది.7,053 బాలురు పరీక్షలు రాయగా 6,927 మంది విద్యార్థులు పాసయ్యారు.బాలుర పాస్ పర్సంటేజీ 98.21 శాతం రాగా, జిల్లాలో 7,124 మంది బాలికలు పదవ తరగతి పరీక్షలు రాశారు. వారిలో 7,058 మంది బాలికలు పాసయ్యారు. 

బాలికలు 99.7% శాతం పాస్ కావడం విశేషం. జిల్లాలోని 22 సమగ్ర శిక్ష కేజీబీవీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు విశేషమైన ఫలితాలను సాధించారు808 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 799 మంది విద్యార్థులు పాసయ్యారు.98.89 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో 253 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 249 మంది విద్యార్థులు పాసయ్యారు 98.4% రిజల్ట్ సాధించారు.