బాసర ట్రిపుల్ ఐటీలో అత్యధిక సీట్లు సాధించిన సిద్దిపేట జిల్లా

బాసర ట్రిపుల్ ఐటీలో అత్యధిక సీట్లు సాధించిన సిద్దిపేట జిల్లా

జిల్లా విద్యాశాఖ అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు 


ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: బాసర త్రిబుల్ ఐటీ ఫలితాల్లో సిద్దిపేట విద్యార్థులు సత్తా చూపారు.ట్రిపుల్ ఐటీలో రాష్ట్రంలోనే అత్యధిక సీట్లను సిద్దిపేట జిల్లా వాసులు సాధించారు. సిద్దిపేట జిల్లా నుండి 322 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ ఎంపిక అయ్యారు.రాష్ట్రంలో అత్యధిక సీట్లు  సిద్ధిపేట జిల్లా సాధించి  అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరంగా లెక్కిస్తే టాప్ పది నిలిచి ముందు వరుసలో ఉంది. కొత్త జిల్లాల్లో అయితే సిద్దిపేట జిల్లా 322 సీట్లతోమొదటి స్థానంలో, సంగారెడ్డి జిల్లా 178 సీట్లతో రెండవ స్థానంలో, మెదక్ జిల్లా 78 సీట్ల తో 5వ స్థానము లభించింది.

మంత్రి హరీష్ రావు అభినందన
బాసర త్రిబుల్ ఐటీ లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు అత్యధిక సీట్లు సాధించడం పట్ల మంత్రి హరీష్ రావు వర్షం వ్యక్తం చేశారు. ఇది విద్యా శాఖ అధికారుల, ఉపాధ్యాయులు సమిషి కృషి ఫలితం అని, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య,విద్యార్థుల మేధస్సు కు, తపనకు నిదర్శనం అని మంత్రి హరీష్ రావు అన్నారు.ఈ సందర్భంగా జిల్లా విద్యా శాఖ అధికారులను, ఉపాధ్యాయులను అభినందిస్తు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఇదే స్పూర్తితో  ముందు ముందు కొనసాగించాలని ఆకాంక్షించారు.