సిపిఆర్ విధానం పై సిద్దిపేటలో శిక్షణ కార్యక్రమం- హాజరైన మంత్రి హరీష్ రావు

సిపిఆర్ విధానం పై సిద్దిపేటలో శిక్షణ కార్యక్రమం- హాజరైన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: కార్డియాక్ అరెస్ట్ తో స్పృహ కోల్పోయిన వ్యక్తులను తిరిగి స్పృహలోకి తెచ్చేందుకు సిపిఆర్ విధానం ఎంతో అవసరమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కన్నీరు హరీష్ రావు అన్నారు. శ్వాస ఆడేలా  చేసేందుకు సిపిఆర్ విధానం ప్రాథమిక చికిత్స లాంటిదని చెప్పారు మంత్రి హరీష్ రావు. 

సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం రోజున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సి పీ ఆర్ పై శిక్షణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది, అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది పంచాయతీరాజ్ ఉద్యోగులు సిపిఆర్ విధానం పై శిక్షణ పొందారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతా  రెడ్డి ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ , ప్రజాప్రతినిధులు  రాజనర్సు, సాయి చందు, జాప శ్రీకాంత్ రెడ్డి , మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సోమిరెడ్డి పలువురు108 వైద్య సిబ్బంది మాస్టర్ ట్రైనర్స్ తదితరులు ,వైద్య శిక్షకులు, ప్రజా ప్రతినిధులు. పాల్గొన్నారు.  సిపిఆర్ విధానం పై శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్స్, సిబ్బంది తోపాటు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ తదితరులు సిపిఆర్ విధానం పై ప్రజలకు అవగాహన కల్పించారు..