6 న సిద్దిపేట కోమటి చెరువులో హనుమాన్ తెప్పోత్సవం 

6 న సిద్దిపేట కోమటి చెరువులో హనుమాన్ తెప్పోత్సవం 

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని కోమటి చెరువులో ఈ నెల 6న హనుమాన్ తెప్పోత్సవం జరగనుంది. శ్రీ రామరాజు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ తెప్పోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు.అఖిలభారత హనుమతు దీక్ష పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామీజీ, రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు.హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తుల నేతృత్వంలో రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయము నుండి స్వామివారి ఊరేగింపు కోమటి చెరువు వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఐదున్నర గంటలకు కోమటి చెరువులో హనుమాన్ తెప్పోత్సవము నిర్వహిస్తారు. ఈ సందర్భంగా హనుమత్ దీక్ష అఖిలభారత పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ మంత్రి హరీష్ రావులు హనుమత్ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతారు. హనుమత్ దీక్షలో ఉన్న భక్తులకు ఈనెల 14, 15 తేదీలలో విజయవాడలో 17వ తేదీన జాపాలీలో మాలవిరమణ దుర్గాప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా జరుగుతుందని రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయం ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.