దాతల సహకారం అభినందనీయం

దాతల సహకారం అభినందనీయం

జెడ్పి చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట:  ప్రార్థించే పెదవుల కన్నా దానం చేసే గుణం ఎంతో గొప్పదని సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వి.రోజ రాధాకృష్ణ శర్మ కొనియాడారు.దాతల దాతృత్వాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో విద్యారంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా చిన్నకొడురు మండలంలోని రామంచ ప్రాథమిక పాఠశాలలో చక్రపాణి ఆగ్రో ఇండస్ట్రీస్ సిద్దిపేట వారి 14 వేల ఆర్థిక సహాయంతో సమకూర్చిన నోట్ బుక్స్, స్టేషనరీని విద్యార్థులకు అందించారు.దాతలు సహకారంతో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వాటిని సమకూర్చడం అభినందనీయమన్నారు.జిల్లాలో ఎక్కడలేని విధంగా రామంచ పాఠశాలలో దాతల సహకారంతో చాలా కార్యక్రమాలు చేపట్టారన్నారు.మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వం రామంచ పాఠశాలలో 40 లక్షల మేర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో  కార్యక్రమాలకు గ్రామస్తులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం మంచి పరిణామం అన్నారు. పాఠశాలలో నోట్ బుక్కులు విద్యార్థులకు అందించడం అభినందించదగిన విషయమన్నారు. 

ఇటువంటి దాతలు ప్రభుత్వ పాఠశాలలోని పేదలకు చేయూతను అందించడం గొప్ప విషయం అన్నారు. పాఠశాలలో ఆరు తరగతి గదులకు 12 ఫ్యాన్లు 12 ట్యూబ్ లైట్లు సమకూరుస్తానని చైర్పర్సన్  ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఎంఈఓ దేశి రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు రామంచ పాఠశాలలో ఏడు కార్యక్రమాలకు హాజరయ్యానని, విధంగా దాతల సహకారంతో ఇక్కడ కార్యక్రమాలు జరగడం ఆదర్శనీయమన్నారు. దాతల సహకారాన్ని విద్యార్థులు, గ్రామస్తులు సద్వినియోగం చేసుకొని, ప్రైవేటు బడికి వెళ్లకుండా గ్రామస్తులందరినీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ శర్మ,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్,ఎస్ఓ 2 భాస్కర్,సర్పంచ్ హరిపురి సంతోషి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, కార్యదర్శి శేఖరాచారి, నాయకులు విక్రమ్, యాదవరెడ్డి, పర్షయ్య, ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, రాములు, సురేష్ కుమార్ సునీత,దేవకి, వాణి,విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.