ఐదవ రోజుకు చేరిన గ్రామపంచాయతీ  కార్యదర్శుల సమ్మె

ఐదవ రోజుకు చేరిన గ్రామపంచాయతీ  కార్యదర్శుల సమ్మె

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: రెగ్యులరైజేషన్ కోరుతూ సిద్దిపేట జిల్లాలో గ్రామపంచాయతీ కార్యదర్శులు చేపట్టిన నిరవధిక సమ్మె ఐదవ రోజుకు చేరింది. జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మెలో పాల్గొన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు మంగళవారం రోజున మూతికి వస్త్రాన్ని కట్టుకొని మౌనంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు కోరారు. నాలుగు సంవత్సరాల నుంచి రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్నామని పలువురు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు.పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విశ్వనాథపల్లి గ్రామ సర్పంచ్ వాసవి లింగారావు, అంకిరెడ్డిపల్లి గ్రామ ఉపసర్పంచ్ నరసింగరావులు సంఘీభావం తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.