రాజకీయాలలో మానవీయ కోణం కనుమరుగైనది

రాజకీయాలలో మానవీయ కోణం కనుమరుగైనది
  • రాజకీయాలలో మానవీయ కోణం కనుమరుగైనది
  • తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రోపెసర్ కొదండరామ్


ముద్ర  ప్రతినిధి : సిద్దిపేట :అమరుల త్యాగ ఫలితంగా ఎర్పడ్డ తెలంగాణలో బిఅర్ఎస్ విధానాల వల్ల రాజకీయాలలో మానవీయ కోణం లేకుండా చేసారని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కొదండరామ్ అవెదన వ్యక్తం చేసారు.ప్రజలకు,ప్రభుత్వానికి వారధి వుండాల్సిన రాజకీయ నాయకులు దళారులుగా మారారన్నారు, శుక్రవారంనాడు గజ్వేల్, సిద్దిపేటలో పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్త లతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యలు,ప్రభుత్వ విధానాలు ఎన్నికల హమిలపై వారితో చర్చించారు,రైతులకు రుణ మాపి పై ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హమిని విస్మరించారని చర్చించారు.అనంతరం విలేకరులతో మాట్లాడారు.ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు  అవస్ధలు పాలవుతున్నారని కోదండరామ్ చెప్పారు. పంట నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు బైరి రమేష్ ,టీజెస్ జిల్లా అధ్యక్షులు నిరుడి స్వామి జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి యూత్ జిల్లా అధ్యక్షులు కీసరి స్వామి,తదితరులు పాల్గొన్నారు.

జిల్లా నేత కు సన్మానం 

తెలంగాణ జన సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన  నీరుడు స్వామిని దళిత సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు.ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ లో స్వామిని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, యంఎస్పి రాష్ట్ర నాయకులు మైస రాములు,డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిసిసి జిల్లా కొ అర్డినేటర్ సూకురి ప్రవీణ్, డిజెఎస్ యువజన నేత స్వామిలు పాల్గొన్నారు..