సెల్లార్లలో చెత్తకుప్పలు పట్టుకున్న మున్సిపల్ అధికారులు

సెల్లార్లలో చెత్తకుప్పలు పట్టుకున్న మున్సిపల్ అధికారులు
  • రెండు బడ షాపులకు భారీగా ఫైన్
  • చెత్తను మున్సిపల్ వాహనానికి ఇవ్వండి
  • లేకుంటే కేసులు కఠిన చర్యలు తప్పవు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: స్వచ్ఛ సిద్దిపేటకు సహకరించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న బడా షాపుల చెత్త గుట్టును మున్సిపల్ అధికారులు రట్టు చేశారు.మున్సిపల్ వాహనానికి చెత్తను రెగ్యులర్గా ఇవ్వకుండా సెల్లార్లో నిలువ చేస్తున్న బడా షాపుల వారిని మున్సిపల్ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకొని భారీ జరిమానాలు వేశారు.సిద్దిపేటలో స్వచ్ఛ సిద్దిపేటకై తడి, పొడి,హానికర చెత్తలను మున్సిపాలిటీ రెగ్యులర్గా వార్డుల నుంచి సేకరిస్తున్నది. 43 వార్డుల్లో, 43 ప్రత్యేక చెత్త సేకరణ వాహనాలతో రోజు ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు కాలనీలో తిరుగుతూ సేకరణ చేస్తున్నారు.వాహనం వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇచ్చేందుకు లౌడ్ స్పీకర్లను కూడా వాహనాలకు ఏర్పాటు చేశారు.

ఐనప్పటికి సిద్దిపేట పట్టణంలోని సుభాష్ రోడ్ లో గల మాంగళ్య షాపింగ్ మాల్ వారు బల్క్ వేస్ట్ ని మున్సిపల్  వాహనాలకు ఇవ్వక పోవడంతో బుధవారం రాత్రి షాపింగ్ మాల్ సెల్లార్లో స్టోర్ చేసిన బల్క్ వేస్ట్ ని కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశాలమేరకు సానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ పట్టుకుని మాంగల్య షాపింగ్ మాల్ వారికి 15 వేల రూపాయలు జరిమానా విధించారు. ఇదేవిధంగా సిద్దిపేటలోని మెదక్ రోడ్ లో ఉన్న రిలయన్స్ స్మార్ట్ వద్ద కూడా బల్క్ వేస్ట్ చెత్త సెల్లార్లో ఉండటంతో  సానిటరీ ఇనస్పెక్టర్ వనిత  పట్టుకొని వారికి 16 వేల జరిమానా విధించారు చెత్త రహిత పట్టణం కొరకు పట్టణమంత కృషి చేస్తుందని ఇలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లలో వెలుబడే వ్యర్థాలను మున్సిపల్ చెత్త వాహనానికి ఇవ్వకుండా నిల్వ ఉంచటం సరికాదని, మరోసారి ఇది పునరావృతం కాకూడదని షాపింగ్ మాల్ వారిని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ హెచ్చరించారు. సిద్దిపేట పట్టణం పరిశుభ్రంగా ఉండాలని ఉద్దేశ్యంతో మంత్రి తన్నీరు హరీష్ రావు  ఆదేశాలమేరకు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు వార్డులలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది నడుస్తూ చెత్త ఏరుదాం అనే కార్యక్రమం చేస్తూ పట్టణాన్ని పరిశుభ్రత వైపు తీసుకుళ్తున్నామని పట్టణ పరిశుభ్రతకు అందరి సహకారం తప్పనిసరి అని అందరూ చెత్తను మున్సిపల్ వాహనానికి ఇవ్వాలని సూచించారు.