శిథిలావస్థకు చేరిన గృహాలని ఖాళీ చేయండి - సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్

శిథిలావస్థకు చేరిన గృహాలని ఖాళీ చేయండి - సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి పట్టణ నివాసితులు జాగ్రత్తలు తీసుకోవాలని సిద్దిపేట  మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ప్రజలకు సూచించారు. గురువారం ఆయన పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని అపార్ట్మెంట్ లలో గల సెలార్లలో వర్షపు నీరు నిలిచే అవకాశం ఉన్నందున సెలార్లలో గల ప్యానల్ బోర్డ్ లను వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ గాని ఆ పైన ఫ్లోర్ నకు గాని షిఫ్ట్ చేయాలని కోరారు.వర్షపు నీరు చేరినప్పుడు నీటిని వెంటనే తొలగించుటకు డీ వాటరింగ్ మోటార్స్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు.ఇప్పటికే టౌన్ ప్లానింగ్ సిబ్బంది  ద్వారా పట్టణంలోని అపార్ట్మెంట్ లకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. శిథిలావస్థకు చేరిన గృహాలలో నివసించే వారు ఇతర సురక్షిత గృహాలకు ముందస్తుగా వెళ్లాలని,లేనిచో వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరిన గృహాలు కూలినట్లైతే ప్రాణ నష్టం,ఆస్థి నష్టం జరిగే ప్రమాద
ముందన్నారు.