ఎం టి ఎస్ లో మున్సిపల్ సిబ్బంది సమయస్ఫూర్తితో తప్పిన మరో ముప్పు

ఎం టి ఎస్ లో మున్సిపల్ సిబ్బంది సమయస్ఫూర్తితో తప్పిన మరో ముప్పు
  • కోటి 17 లక్షల విలువైన తడి చెత్త ప్యాకింగ్ మిషన్లు, లోడర్ ను కాపాడుకున్న సిబ్బంది
  • డి ఆర్ సి సి లో 200 మందితో  భారీ రెస్క్యూ ఆపరేషన్ 
  • 'ముద్ర ప్రతినిధి' క్షేత్రస్థాయి పర్యటనలో వెళ్లడైన వాస్తవం

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: సాధారణంగా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ స్టేషన్ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తారు. కానీ సిద్దిపేట పట్టణంలో శనివారం మధ్యాహ్నం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మొదట రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది సిద్దిపేట పురపాలక సంఘం సిబ్బంది. సుమారు 200 మంది మున్సిపల్ సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని కోటి 17 లక్షలరూపాయల విలువైన తడి చెత్త ప్యాకింగ్ యంత్రాలను హుక్ లోడర్ ను కాపాడుకున్నారు.

'ముద్ర ప్రతినిధి' క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా డి ఆర్ సి సి ని సందర్శించినప్పుడు ఈ విషయం బయటపడింది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపల్ ఆఫీసుకు చెందిన తడి చెత్తను, పొడి చెత్తను వేరుచేసి విక్రయించే, క్రమబద్ధీకరించే, మద్యస్థ తరలింపు కేంద్రం (ఎం టి ఎస్) హౌసింగ్ బోర్డ్ పరిధిలో ఉంది. టీచర్స్ కాలనీ కోమటి చెరువు రోడ్డు సమీపాన ఉంది. పట్టణం పరిధిలోని 43 వార్డుల నుంచి ప్రతిరోజు ఈ ఎంటిఎస్ కు వంతుల వారి తడి, పొడి చెత్తలను మున్సిపల్ వాహనాల్లో తీసుకొస్తారు.

పొడి చెత్తను మద్యస్థ తరలింపు కేంద్రంలో ఉన్న డిఆర్సిసి లోని ఎర్త్ బాక్స్ కంపెనీ వాళ్ళు కొనుగోలు చేస్తుండగా, తడి చెత్తను మాత్రం మున్సిపల్ శాఖ అధికారులే తమ సిబ్బందితో ఇక్కడ కాంపాక్టర్లలో ప్రెస్సింగ్ చేయించి పట్టణ సమీపంలోని బుస్సాపూర్ లో ఉన్న బయో ప్లాంట్ కు పంపిస్తుంటారు. పట్టణంలో ప్రతిరోజు 30 టన్నుల తడి చెత్త లభిస్తుండగా, పొడి చెత్త దాదాపు 10 టన్నులు రోజు లభిస్తుంది.ఈ విధంగా లభించిన 40 టన్నుల తడి, పొడి చెత్తలను మద్యస్థ తరలింపు కేంద్రానికి ప్రతిరోజు తీసుకొస్తారు. శనివారం మధ్యాహ్నం మద్యస్థ తరలింపు కేంద్రంలోని డిఆర్సిసి షెడ్డులో రా మెటీరియల్ డిసిఎం లో లోడింగ్ చేస్తుండగా ఎండ వేడిమికి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు మొదలుకాగానే అక్కడున్న కొద్దిమంది మున్సిపల్ సిబ్బంది వేగంగా అప్రమత్తమయ్యారు.

తాము నిత్యం ఉపయోగించే ఎఫ్ఎం సెట్ ద్వారా ప్రమాద సమాచారాన్ని ఉద్యోగులందరికీ చేరేవేయడం తో దాదాపు 200 మంది సిబ్బంది నిమిషాల్లోనే ఈ కేంద్రానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సమీపంలో ఉన్న తడి చెత్త ప్రెస్సింగ్ చేసే రెండు కాంపాక్టర్లకు వీటిని తరలించేందుకు ఉపయోగించి మరో ఉక్కు లోడర్ను అగ్ని ప్రమాదం బారిన పడకుండా మరి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.

ప్రమాదం జరిగిన సమయంలో సిద్దిపేట అగ్నిమాపక శకటం తోర్నాల జరిగిన మరో ప్రమాద ఘటన స్థలి వద్ద ఉండడంతో వెంటనే డిఆర్సిసికి చేరుకోలేదు. ఈ గోల్డెన్ అవర్ లోనే మున్సిపల్ అధికారులు, సిబ్బంది వాటర్ ట్యాంకర్లతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. పట్టణంలో చెట్లకు నీటిని అందించే వాటర్ ట్యాంకర్లను వెంటనే రప్పించుకోవడంతో పాటు సమన్వయంతో పనిచేసి మున్సిపల్ కు చెందిన 42 లక్షల విలువైన హుక్ లోడర్ వాహనాన్ని, 45 లక్షల విలువైన రెండు కాంపాక్టర్లను, 30 లక్షల విలువైన తడి చెత్త సేకరణ షెడ్డును అగ్ని ప్రమాదం బారిన పడకుండా వారంతా కాపాడుకున్నారు.

ప్రమాద తీవ్రత పెరగకుండా అన్ని వనరులను ఉపయోగించుకొని పని చేశారు. ఇంతలో ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ మున్సిపల్ సిబ్బంది కూడా విశేషంగా సహకరించిన అప్పటికే ఎర్త్ బాక్స్ కంపెనీకి చెందిన పొడి చెత్త సేకరణ కేంద్రం డి ఆర్ సి సి ఎక్విప్మెంట్ పూర్తిగా కాలిపోయింది. 10 గంటల పాటు నీటిని చిమ్మి మంటల్ని పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. సిద్దిపేటలో పొడి చెత్త సేకరణ

ప్రస్తుతంనిలిచిపోయినప్పటికీ తడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని సిద్దిపేట మున్సిపాలిటీ సోమవారం నుంచి యధాతధంగా ప్రారంభించింది. పట్టణంలోని 43 వార్డుల నుంచి 45 వాహనాల ద్వారా సోమవారం తడి చెత్తను సేకరించి ఎంటిఎస్ లో కాంపాక్టర్లకు యధావిధిగా అందించారు. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన డి ఆర్ సి సి ని మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు మాజీ చైర్మన్ కడవెరుగు రాజనర్ నేతృత్వంలో పరిశీలించారు. హెల్త్ బాక్స్ థర్డ్ పార్టీ కంపెనీ వారిని పొడి చెత్త సేకరణకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి మున్సిపల్ ప్రాపర్టీని కాపాడినందుకు వారిని అభినందించారు.