సిద్దిపేటలో ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేటలో ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దుస్తులను పంపిణీ చేశారు. ఆదివారము మధ్యాహ్నం సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్లో జరిగిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడుతూ సిద్దిపేటను స్వచ్ఛ సిద్ధిపేటగా మార్చినందున ప్రజలంతా పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని కోరారు.

ముస్లిం మైనారిటీల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఆ సంక్షేమ పథకాలను వినియోగించుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. సిద్ధిపేట జిల్లాలో పలుచోట్ల మైనారిటీల కోసం రెసిడెన్షియల్ స్కూల్లోనే హాస్టల్ ఏర్పాటు చేశామన్నారు.

సిద్దిపేటలో ఇంకా రెండు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు ఖాళీ ఉన్నందున ముస్లిం సోదరులంతా తమ పిల్లల్ని తప్పకుండా హాస్టల్లో చేర్పించాలని కోరారు ఇంగ్లీష్ మీడియంలో స్కూలు, తగిన రీతిలోహాస్టల్ వసతులు ఉన్నందున తమ పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం అని మంత్రి హరీష్ రావు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కంటే కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి  పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టిందని కొని యాడారు. సిద్దిపేట ఆర్డిఓ అనంతరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెరుగు రాజనర్సు, మున్సిపల్ కౌన్సిలర్లు కాజా అత్తర్ పటేల్, రియాజ్, వజరుద్దీన్, మోహిష్  చిన్న, రాజు, వడ్లకొండ సాయి, సిద్దిపేట పట్టణ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి,  సాయిరాం ,మోహన్లాల్ ఇర్షాదు ,నాయకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.