ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం నాడు మే 5 న జరిపే 
రాష్ట్ర పురపాలక, ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ క్షేత్ర స్థాయిలో గురువారం పరిశీలించారు. 
 మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న ఇండోర్ స్టేడియంను పరిశీలించారు.

అన్ని ఏర్పాట్లు చెయ్యాలని డివైఎస్ఓ నాగేందర్ కి తెలిపారు. బయట చెత్త చెదారం లేకుండా మైదానం మొత్తం శుభ్రం చెయ్యాలని, మైదానంలో ఏర్పాటుచేసిన  హెలిప్యాడ్ ను పరిశీలించారు. మైదానంలో  హెలికాప్టర్ లాండ్ అయ్యై చుట్టూ పక్కల ఎలాంటివి ఉండకుండా చుసుకోవాలని అధికారులకు సూచించారు. టిటిసి బిల్డింగ్, బస్తిధవాఖాన, గవర్నమెంటు డిగ్రీ కళాశాల, మునిసిపల్ ఆపిస్ కాంప్లెక్స్, రెండు పడగ గదుల ఇండ్లు, ఎస్టి మహీళల వసతి గృహాల ప్రారంభోత్సవాలు ఎసిపి కార్యలయం, ఎల్లమ్మ ట్యాంక్ సుందరీకరణ శంకుస్థాపనల అనంతరం జరిగే బారి బహిరంగ సభ కు కావలసిన ఏర్పాట్లను చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

నిరంతరంగా విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్ శాఖ అధికారులకు, రెండు పడకగదుల ఇళ్ళు మిగతా పనులను వేగంగా పుర్తి చెయ్యాలని ఆర్&బి అధికారులకు తెలిపారు.  శిలాపలకాలను అందంగా ముస్తాబు చేయ్యాలన్నారు. అందరు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా ఏర్పాట్లు చేయ్యాలన్నారు. హెలిప్యాడ్ ఆవరణలో  సభ ప్రాంగణంలో ఫైరింజన్లను పెట్టాలని పైర్ డిపార్ట్మెంట్ అధికారులను,108 వాహనాలను ఉంచాలని సరిపడినన్ని ఓఆర్ఏస్ పాకెట్ లు ఉంచాలని డిఎం&ఎచ్ఓ డా.కాశీనాథ్ కు పోన్ ద్వారా తెలిపారు.   కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ పైజాన్ అహ్మద్, సంబంధిత శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.