నీటిపారుదల ఉన్న ప్రాంతాలలో మొక్కలు నాటేలా చర్యలుతీసుకోవాలి :కలెక్టర్ వల్లూరు క్రాంతి

నీటిపారుదల ఉన్న ప్రాంతాలలో మొక్కలు నాటేలా చర్యలుతీసుకోవాలి :కలెక్టర్ వల్లూరు క్రాంతి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : గద్వాల గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి అధికారులు, ఎం పి డి ఓ లు  కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. 
గురువారం  కల్లెక్రేట్ సమావేశం హాలు నందు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2022 -23 పీర్ వెరిఫికేషన్  పై ఒక్క రోజు  అవగాహన శిక్షణ. సంబంధించిన అంశంపై అధికారులతో సమీక్ష  సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం వివరాలను గురించి కలెక్టర్ మాట్లాడుతూ. గ్రామాల వారీగా పీర్ వెరిఫికేషన్ సర్వేత్వరగా పూర్తి చేయాలనీ, ఫీడర్ ఛానల్ (కెనాల్)  పనుల అవసరం మేరకు గుర్తించి  వారంలోపు నివేదికలు అందజేయాలన్నారు. ఇందుకు సంబంధించిన ఎస్టిమేషన్ ట్యాంకులు తదితర వివరాలు ఇవ్వాలన్నారు. గ్రామాలలో సంపద వనాలు ఎన్ని ఉన్నాయి? హరితహారం కార్యక్రమానికి ముందే ప్రణాళిక తయారు చేసుకుని నీటిపారుదల ఉన్న ప్రాంతాలలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని రిజర్వాయర్ల వెంబడి పెద్ద మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని,  హరితహారం కార్యక్రమం కింద  మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించి ప్రణాళికలు సిద్దం చేయాలనీ,ఎంపీడీవోలు పర్సనల్ ఇంట్రెస్ట్ గా తీసుకుని ప్రకృతి వనాలను పర్యవేక్షించి పెద్దమొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

 ప్రతి గ్రామ పంచాయతీలో  ప్రతి బుధవారం ఉపాధి హామీ సమావేశాలు నిర్వహించి గ్రీనరీ ఎక్కువ చేయాలని ఆ దేశంలో ఉన్నప్పటికీ ఇంకా గ్రీనరీ పెరగడం లేదని అన్నారు. కేటీ దొడ్డి, ఉండవల్లి, గట్టు, మండల ప్రతి బుధవారం సమావేశాలు ఏర్పాటు చేసి ఉపాధి హామీ కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు  చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీవోలు ఫీల్డ్ విజిట్ చేసి లేబర్ మొబలైజేషన్ చేయాలన్నారు. అలంపూర్ చౌరస్తా నుండి వరకు దేవాలయం ముఖ్యమైన రహదారి మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలు నాటే గుంతలలో ఎర్ర మట్టి వేసి నాణ్యతగా మొక్కలు నాటించే బాధ్యత ఎంపీడీవోల దే తెలిపారు. సెక్రికేషన్ షెడ్లలో వెదురు కంచె ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెక్రికేషన్ షెడ్లలో కంపోస్ట్ ఎరువులు తయారవుతున్నాయా, ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఉందా ,ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉన్నాయా పూర్తి వివరాలు అందజేయాలన్నారు. గ్రామాలలో ఇంకుడు గుంతలు ఉన్నాయా లేకుంటే ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలలో మురుగునీరు కాలువలనుండి చివరి వరకు వెళ్తున్నాయా కమ్యూనిటీ సోప్ కిట్స్ తయారు చేశారా అడిగి తెలుసుకున్నారు. 


అంతకు ముందు స్పోర్ట్స్ పై మాట్లాడుతూ జిల్లా లో ముఖ్య మంత్రి 2023 కి సంబంధించి స్పోర్ట్స్ నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేయాలనీ,  గ్రామ స్తాయి, మండలం స్తాయి, జిల్లా స్తాయి, రాష్ట్ర స్తాయి వరకు పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికీ ప్రైజ్ మని ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మండల కమిటి ఏర్పాటు చేయాలనీ, ఎం పి డి ఓ, జాడ్ పి టి సి, ఎం పి పి, ఎం ఆరో ఓ, ఎం ఇ ఓ, ఎస్ ఐ, మున్సిపాల్టి వారు సబ్యులు గ  కమిటి లో ఉంటారని, మహిళలు పురుషులు ఈ పోటీలలో పాల్గొనేటట్లు చూడాలని, కబాడీ,కోకో, వాలి బాల్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ మొదలైన ఆటలు నిర్వహించేదుకు చర్యలు తీసుకోవాలని, ప్రజా ప్రతి నిదులను సమన్వయం చేస్తూ స్పోర్ట్స్ నిర్వహించేందుకు చర్యలు తెసుకోవాలని  తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, డిఆర్డిఏ ఉమాదేవి, ఇ డి ఎస్సి కార్పోరేషన్ రమేష్ బాబు నాగేంద్రం  ఇరిగేషన్ అధికారి రహీముద్దీన్, శ్రీనివాస్, ఎంపీడీవోలు, ఏపీవోలు ఏపిఎంలు  తదితరులు పాల్గొన్నారు.