ఎకరాకు రూ 30 వేల పరిహారం ఇవ్వాలి

ఎకరాకు రూ 30 వేల పరిహారం ఇవ్వాలి

ముద్ర ప్రతినిధి, జనగామ:  అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కురుమ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలో కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా జనాభాలో అత్యధిక శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరికీ రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించాలన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు చిర్ర వీరస్వామి, రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి తలారి గణేశ్‌, రాష్ట్ర కార్యదర్శి మైల అంజయ్య, గోవర్ధన్ జినుక, రాము కురుమ పాల్గొన్నారు.