ఉగాది కథల పోటీ బహుమతుల ప్రదానోత్సవం నేడు

ఉగాది కథల పోటీ బహుమతుల ప్రదానోత్సవం నేడు

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: సుగుణ సాహితి సమితి సిద్దిపేట నిర్వహించిన 2023 సంవత్సర ఉగాది బాలల కథల పోటీలో విజేతలైన 20 మంది విద్యార్థులకు నగదు బహుమతుల ప్రదానం  మంగళవారం రోజున సిద్దిపేట ప్రతిభ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్నం 2.30 గంటలకు జరుగుతుందని సుగుణ సాహితి సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య గుమ్మన్నగారి బాల శ్రీనివాస మూర్తి, సిద్దిపేట మండల విద్యాధికారి సత్తు యాదవరెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు మర్పడగ చెన్నకృష్ణారెడ్డి,ప్రతిభ కళాశాల ప్రిన్సిపల్ దాతారు సూర్య ప్రకాష్ , బాల సాహితీవేత్త డా.వాసరవేణి పర్శరాములు, యువ కవి వేల్పుల రాజు పాల్గొంటారు.కథల పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం మరియు బాలలను ప్రోత్సహించిన పదహారు మంది ఉపాధ్యాయులను సన్మానిస్తామని తెలిపారు.అనంతరం యాడవరం చంద్రకాంత్ గౌడ్ వ్రాసిన బాలల కథల పుస్తకం చంద్రుడు చెప్పిన కథలు పై పరిచయ కార్యక్రమం ఉంటుందని, ఈ సమావేశానికి బాల కథకులు,ఉపాధ్యాయులు,బాల సాహిత్య ప్రోత్సాహకులు  హాజరు కావాలని  తెలిపారు