దౌల్తాబాద్ లో సీడ్స్ & ఫర్టిలైజర్ షాప్ లలో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు

దౌల్తాబాద్ లో సీడ్స్ & ఫర్టిలైజర్ షాప్ లలో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు

 కాలం చెల్లిన విత్తనాలు, పురుగు మందులు స్వాధీనం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట:  సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపులలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన విత్తనాలు, పురుగుమందు డబ్బాలు స్వాధీనపరచుకొని మండల వ్యవసాయ అధికారులకు అప్పగించారు. శుక్రవారం నాడు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ సిఐ రమేష్ సిసిఎస్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్,డెలివరీ రిజిస్టర్, బిల్ బుక్, తదితర రికార్డ్స్ తనిఖీ చేసి షాప్ లో ఉన్నా సీడ్స్ ఫర్టిలైజర్ పరిశీలించారు.కాలం చెల్లిన విత్తనాల ప్యాకెట్లు,పురుగు మందులు,విడి విత్తనాలు వారు పట్టుకున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు తెలంగాణ ట్రేడర్స్ , జ్యోతి ట్రేడర్స్, శ్రీలక్ష్మి రైతు సేవా కేంద్రం, బాలాజీ రైతు సేవా కేంద్రం షాపులలో కాలం చెల్లిన వివిధ రకాల విత్తనాల 75 ప్యాకెట్లు.వివిధ రకాల కాలం చెల్లిన పురుగుమందు డబ్బులు 60 లీటర్లు, 55 కేజీల పౌడర్,వివిధ రకాల విడి విత్తనాలు 75 కిలోలు స్వాధీనం చేసుకొని దౌల్తాబాద్ అగ్రికల్చర్ అధికారి గోవింద్ రాజుకు సిఐ రమేష్ బృందం అప్పగించింది.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ రమేష్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు, కాలం చెల్లిన పురుగుమందులు, నకిలీ పురుగు మందులు అమ్మే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరచుగా షాపులను తనిఖీ చేయడం జరుగుతుందని, రైతులను మోసం చేయాలని చూసే షాపు యజమానులపై కఠినంగా వ్యవహరిస్తామని, రైతులు కూడా అప్రమత్తంగా ఉండి వ్యవసాయ అధికారులు సూచించిన విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఏ షాపులో కొన్న తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో విడి విత్తనాలు,ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉన్నట్లు నకిలీ పురుగు మందులు కాలం చెల్లిన పురుగుమందులో విత్తనాలు ఎవరైనా అమ్ముతున్నట్లు సమాచారం వస్తే వెంటనే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కు సమాచారం అందించాలని సూచించారు.