రెండు లక్షల 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు - శ్రీనివాస్ రెడ్డి వెల్లడి

రెండు లక్షల 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు - శ్రీనివాస్ రెడ్డి వెల్లడి

సిద్దిపేట, ముద్ర ప్రతి నిధి : సిద్దిపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, సరఫరాను వేగవంతం చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ ( రెవెన్యూ )శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నాడు ఆయన 'ముద్ర ప్రతినిధి'తో  మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన 419 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే రెండు లక్షల పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు. మరో 90,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. కొనుగోలు పూర్తయిన  20 చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేసామని శ్రీనివాసరెడ్డి వివరించారు. ఐకెపి లతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా జిల్లా పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు, గోదాములకు సరఫరా చేసుకున్నదని తెలిపారు. మిగతా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వివరించారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను తాను ప్రత్యేకంగా సందర్శించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకున్నానని తెలిపారు.