దేశానికి దిక్సూచిలా మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేశాం..

దేశానికి దిక్సూచిలా మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేశాం..

 ఫ్లోరైడ్ భూతాన్ని రాష్ట్రం నుంచి తరిమేసాం...

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ తాగునీటి పథకం దేశానికి దిక్సూచిలా మారిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు కేంద్ర ప్రభుత్వం కూడా మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తుందని దయాకర్ రావు వెల్లడించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం లో మిషన్ భగీరథ పథకం ద్వారా నిర్మించిన నీటి శుద్ధీకరణ కేంద్రానికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి నీటిని సరఫరా చేసే పంపులను ట్రయల్ రన్ చేసి మంత్రి హరీష్ రావు తో కలిసి ఎర్రబెల్లి ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి మిషన్ భగీరథ పథక పర్యవేక్షకురాలు స్మిత సబర్వాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరము అనంతరము మల్లన్న సాగర్ డ్యాం కింద తిప్పారం శివార్లలో నిర్మించిన పంపులను పరిశీలించారు  అనంతరం కొండపాక మండలం మంగోలు శివారులో నిర్మించిన మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ నిర్మాణాలను పరిశీలించారు తిప్పారం నుండి మంగోలు ఫిల్టర్ కు చేరిన మిషన్ భగీరథ నీటికి ప్రత్యేక పూజలు చేసి జల హారతినిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రులు ఇద్దరు విలేకరులతో తో మాట్లాడారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి రోజు వంద లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నీటి సరఫరా లో నిలిచినప్పటికీ కేంద్రం రాష్ట్ర నిధుల వాటా కేటాయించలేదని ఆరోపించారు ఫైనాన్స్ కమిషన్ చెప్పిన 19 వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ తెలంగాణకు కేంద్రం ఇవ్వలేదని విమర్శించారు మంచినీటి పథకాల విషయంలో ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసి ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందని తెలిపారు రాష్ట్రము గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరా లో మంచి ప్రమాణాలు పాటించినందునే కేంద్రం నుండి అనేక అవార్డులు లభించాలని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ వద్ద ఏర్పాటు చేస్తున్న మిషన్ భగీరథ వాటర్ పథకంతో ఏడు జిల్లాలకు 10 అసెంబ్లీ నియోజకవర్గం 16 మునిసిపాలిటీలకు 1922 గ్రామపంచాయతీలకు తాగునీటి సరఫరా ఇక పుష్కలంగా లభిస్తుందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్లే వచ్చే 50 సంవత్సరాలకు సరిపడా నీటిని గ్రామాలు పట్టణాలకు అందేలా ఈ పథకాన్ని డిజైన్ చేసినట్లు తెలిపారు హైదరాబాద్ అవసరాల నుంచి వాడుకుంటున్న నీటిని కూడా ఇక హైదరాబాద్కే చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు రోజు 500 ఎంఎల్డి సామర్థ్యం గల నీటిని శుద్ధి చేసే ప్లాంట్ ను 1212 కోట్ల రూపాయలతో మల్లన్న సాగర్ వద్ద చేపట్టినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు ఈరోజు 50% పథకాన్ని ప్రారంభించామని మరో 50% పనులు త్వరలో పూర్తి చేస్తామని వివరించారు