బక్రీద్ ఏర్పాట్ల పై మున్సిపల్ కమిషనర్ సమీక్ష | Municipal Commissioner's review of Bakrid arrangements

బక్రీద్ ఏర్పాట్ల పై మున్సిపల్ కమిషనర్ సమీక్ష | Municipal Commissioner's review of Bakrid arrangements

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ఈ నెల 29న జరిగే బక్రీద్ పర్వదినo సందర్భంగా సిద్దిపేట పట్టణంలో మున్సిపల్ తరపున చేయవలసిన ఏర్పాట్లపై కమిషనర్ సంపత్ కుమార్ సమీక్ష నిర్వహించారు శుక్రవారం నాడు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో కమిషనర్ సంపత్ కుమార్ తోపాటు వైస్ చైర్మన్ జంగిటి కనకరాజులు తన్జీమ్ లతోపాటు మైనారిటీ నేతలు,కౌన్సిలర్లు పాల్గొన్నారు. అన్ని మసీదులు, ఈద్గాల వద్ద శానిటేషన్ పనులు వెంటనే నిర్వహించాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు.హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు, త్రాగు నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ ను ఆదేశించారు. కుర్బానీ చేసిన అనంతరం వ్యర్థాలను మున్సిపల్ వాహనాల ద్వారా తరలించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో కౌన్సిలర్లు రియాజుద్దీన్,తాడూరి సాయి ఈశ్వర్ గౌడ్, ప్రజాప్రతినిధులు వజీరుద్దిన్,మొయిజ్,కో అప్షన్ సభ్యుడు సయీద్,తంజీమ్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.