వడగండ్ల బాధిత రైతులకు కేంద్రం ఎకరాకు పదివేల నష్టపరిహారం ఇవ్వాలి

వడగండ్ల బాధిత రైతులకు కేంద్రం ఎకరాకు పదివేల నష్టపరిహారం ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు పదివేల నష్టపరిహారం ఇస్తుంది

రైతుల మీద ప్రేమ ఉంటే కేంద్రము దిగి రావాలి

ఇద్దరం కలిసి ఎకరాకు 20,000 ఇచ్చి రైతుల్ని ఆదుకుందాం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి అకాల వర్షాలు, వడగళ్ల వానలతో తెలంగాణ రైతాంగం పంటలను కోల్పోయింది.
చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో ఆర్థికంగా వారు చితికిపోయారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కాపాడుకోవడానికి ముందుకు వచ్చి ఎకరాకు పదివేల నష్టపరిహారం ఇస్తామన్నారు మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులపై ప్రేమ ఉంటే ఇంకో పదివేల రూపాయలు ఎకరాకు అందిస్తే రెండు కలిపి 20 వేల రూపాయల నష్టపరిహారాన్ని రైతుకు అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు మంగళవారం రాత్రి అకాల వర్షాలు వడగళ్ల వానతో తెలంగాణ జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గం లో బుధవారం రోజంతా పరిశీలించారు దుబ్బాక మండలం పోతారం గ్రామంలోని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, మరికొందరు భాజపా నేతలకు దమ్ము ధైర్యాలు ఎక్కువ కదా కేంద్రంతో మాట్లాడి వడగళ్ల బాధిత రైతులకు పరిహారాన్ని ఇప్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు