సెప్టెంబరు లక్ష మంది పెరికలతో సభ నిర్వహిస్తాం

సెప్టెంబరు లక్ష మంది పెరికలతో సభ నిర్వహిస్తాం

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి

సిద్దిపేట జిల్లా పెరిక కుల సంఘం ఆత్మీయ సమ్మేళనం,జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు లక్కరసు ప్రభాకర్ వర్మ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది.ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులు గా రాష్ట్ర అధ్యక్షులు లక్కర్స్ ప్రభాకర్ వర్మ,తోపాటు ప్రధాన కార్యదర్శి దనేకుల కృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శి బోసాని బాలరాజు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బుయ్యని శివకుమార్,రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు సాదే పరమేష్,యువజన సంఘం ఆర్థిక కార్యదర్శి కటకం మహేందర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్థిక కార్యదర్శి పోతురాజు తిరుపతి బండచెర్లపల్లి సర్పంచ్ పోతరాజు దశరథం హాజరయ్యారు.

  ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ తన ఈ రెండు సంవత్సరాల కాలం పూర్తిగా సంఘ సేవకు మాత్రమే ఉపయోగిస్తానని, తాను మొదటిగా చెప్పినట్టు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను పూర్తి చేస్తూ సభ్యత్వ నమోదు కుల గణనను పూర్తి చేస్తానని, అదేవిధంగా సెప్టెంబర్ చివరి వరకు లక్ష మందితో హైదరాబాద్ నగరంలో పెరిక కుల మహాసభను నిర్వహిస్తానని అంతేకాకుండా ఈ సభాముఖంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ పెరక కుల కార్పొరేషన్ ఏర్పాటు అలాగే మన కులవృత్తి లేనందున మనకు జూట్ కార్పొరేషన్ మన పెరక కులానికి ఇచ్చే విధంగా తోడ్పాటు అందిస్తానని అన్ని కులాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్న విధంగా మన కులంలోని  58 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ అమలు చేయాలని విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారు తెలిపారు.గ్రామ గ్రామాన్ని తిరుగుతూ వారి సాధక బాధకాలు పంచుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు.