సంకినేని బహిరంగ చర్చకు సిద్ధమా

సంకినేని బహిరంగ చర్చకు సిద్ధమా
  • ప్లేస్ నువ్వు చెప్పినా సరే...నన్ను చెప్పమన్నా సరే 
  • అవాకులు చవాకులు పేలితే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుంది
  • దమ్ముంటే చర్చకు రా
  • మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు కు డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ సవాల్
  • సూర్యపేట పట్టణం లోని జనగామ రోడ్డులో గల వజ్ర టౌన్ షిప్ పక్కన మూసీ కాల్వను అక్రమించారని బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన వట్టే జానయ్య యాదవ్
  • వజ్ర రైస్ మిల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జానయ్య యాదవ్ 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట

మూసీ కాల్వను అక్రమించినట్లు సంకినేని చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ యాదవ్ స్పష్టం చేశారు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆరోపణలు చేయడం..తోక ముడవడం సంకినేనికి అలవాటని ఎద్దేవా చేశారు.నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడం సంకినేనికి అలవాటు గా మారిందన్నారు.
బలహీన వర్గాలకు చెందిన నాపై ,బలహీన వర్గాల నాయకులను పంపి సంకినేని రాక్షస ఆనందం పొందుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

సంకినేనికి దమ్ముంటే స్వయంగా ఆయనే చర్చకు రావాలని డిమాండ్ చేశారు.అంతే కాని బలహీన వర్గాల నాయకులని పంపి రాజకీయ వికృత క్రీడకు పాల్పడుతున్నాడడం సబబు కాదని హితవు పలికారు సర్వే నెంబర్ 480లో మూసీ కాల్వ ఆక్రమణ జరిగిందని చేస్తున్న ఆరోపణ నిరాధారం ఆని స్పష్టం చేశారు.

మూసీ కాల్వను అక్రమించలేదు అని కలెక్టర్ ఏర్పాటు  చేసిన 4గురు సభ్యుల కమిటీ రిపోర్ట్ ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు

బలహీన వర్గాలను వేదించడమే సంకినేని పని అని విమర్శించారు

వజ్ర రైస్ మిల్ ఏర్పాటు చేసిన దగ్గర నుండి చాలా నిజాయితీగా రైతులకు సేవ చేస్తున్నామని రాష్ట్ర స్థాయిలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వడంలో వజ్ర రైస్ మిల్ అగ్ర స్థానం లో ఉన్నదని వివరించారు

నన్ను అడ్డం పెట్టుకొని మంత్రి జగదీష్ రెడ్డి మీద ఆరోపణలు చెయ్యాలి అనుకుంటే సూర్యుడు మీద ఉమ్మివేసినట్టేనని అన్నారు.
ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిచి మహనాయకునిగా సంకినేని ఫీల్ అవుతున్నాడని ఆరోపించారు.

20సంవత్సరాలుగా వార్డు మెంబర్ స్థాయి నుండి అంచలంచలుగా ఎదిగి నిత్యం ప్రజల్లో ఉంటున్నానని, బలహీన వర్గాలకు చెందిన నా ఎదుగుదలను చూసి సంకినేని ఓర్వలేక పోతున్నాడని,
సంకినేని సొంత ఊరికి తరిమే వరకు తన పోరాటం ఆగదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకా ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రఫీ, జానిమియా, అఫ్జల్ వాసుదేవరెడ్డి  వెంకట రాములునగిరే సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.