సోషల్ మీడియా వార్

సోషల్ మీడియా వార్
  • సూర్యాపేటలో మోత మోగుతున్న సోషల్ మీడియా
  • మంత్రి జగదీశ్ రెడ్డి వర్సెస్ జానయ్య యాదవ్
  • ఎవరికి వారే అనుకూల పోస్టింగులు
  • వాట్సప్ టెలిగ్రామ్ ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ట్విట్టర్, ఫేస్ బుక్ లింక్ డిన్ లలో విపరీతంగా ప్రచారం

సోషల్ మీడియా (సామాజిక మాధ్యమం): నేడు ప్రచార ప్రసార రంగంలో రాజ్యమేలుతుంది నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ యుగంలో కొత్త పుంతలు తొక్కుతుంది. అది మంచి అయినా చెడు అయిన క్షణాల్లో మొబైల్ ఫోన్ల ద్వారా వ్యక్తులను చేరుతుంది ఒకనాడు ఈరోజు పేపరు వార్తలు తెలియాలంటే 24 గంటలు వెయిట్ చేస్తే గాని రేపటికి పేపర్ చదవని పరిస్థితులు ఉండేవి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రావడంతో సమాచారం మరింత చేరువైంది ప్రస్తుతం డిజిటల్ యుగం సమాచార రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడంతో సంఘటన జరిగిన క్షణాల్లోనే మాధ్యమాల ద్వారా ప్రపంచమంతా చుట్టి వస్తుంది. ఈ నేపద్యంలో గత నెల రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సోషల్ మీడియా వేదిక అయింది. సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ పొట్టి జానయ్య యాదవ్ ల మధ్యన కొనసాగుతున్న కోల్డ్ వార్ సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తుంది. ఇందుకుగాను ఇరు వర్గాలు కూడా సోషల్ మీడియా వారియర్స్ తో ఒక యుద్ధ వాతావరణం మొబైల్స్ లోనే సృష్టిస్తున్నారు. సమస్యను పెద్దదిగా చేసి తీవ్రత పెంచేదిగా సోషల్ మీడియా నష్టం కూడా వెంటనే కలిగిస్తుంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి.

వివాదానికి బీజం పడింది ఇక్కడే

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల తరఫున తాను కూడా ఎమ్మెల్యేగా పోటీల్లో ఉంటానని పోటీలో ఉంటానని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ సోషల్ మీడియా వేదికగా పలు చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం అందులో మంత్రి జగదీశ్ రెడ్డి కి వ్యతిరేకంగా మాట్లాడడం వివాదానికి పునాదిగా బీజం పడ్డట్టు అయింది. ఇన్నేళ్లుగా మంత్రి జగదీష్ రెడ్డికి అనుచరుడుగా ఉన్న జానయ్య యాదవ్ గత కొంతకాలంగా మంత్రికి దూరంగా ఉండటం సమస్యలకు అసలు కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు సామాజిక మాధ్యమాల ద్వారా మంత్రి జగదీశ్ రెడ్డి పై పలు విమర్శలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది.

జానయ్య యాదవ్ వ్యాఖ్యలపై స్పందించని మంత్రి

ఇన్ని రోజులుగా మంత్రి జగదీశ్ రెడ్డి ని జానయ్య యాదవ్ పలు సందర్భాలలో టార్గెట్ చేసి మాట్లాడినప్పటికీ ఏనాడు కూడా మంత్రి నోరు విప్పి సమాధానం ఇవ్వలేదు కనీసం స్పందించలేదు ఆయన ఆరోపణలకు ప్రత్యరోపణ రూపన చేయలేదు. అనవసర అసత్య అబద్ధపు తనకు సంబంధం లేని విషయాలకు ఎందుకు స్పందించాలనే కోణంలో మంత్రి హుందాతనంతో వ్యవహరించి సైలెన్స్ గా ఉన్నట్టు బీ ఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ జానయ్య యాదవ్ ఆరోపణలపర్వం ఆగలేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వార్ మాత్రం మంత్రి అనుకూల జానయ్య అనుకూల వర్గాలుగా విడిపోయి జోరుగా కొనసాగుతుంది.

గ్రాఫిక్ డిజైనర్లు వ్యూహకర్తలకు బలేగిరాకి

సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్డ్ ఇన్ టెలిగ్రామ్ తదితర మాధ్యమాల ద్వారా పరస్పర ఆరోపణలు వీడియోల పోస్టింగులు రాస్తారోకోలు ధర్నాల క్లిప్పింగులు అనుకూల ప్రతికూల వర్గాల న్యూస్ అండ్ వ్యూస్, ప్రశ్నలు సమాధానాలు ప్రతి సమాధానాలు ఒక దశలో దాటి అసభ్య పదజాలాలు శృతిమించుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి జానయ్య యాదవ్ మంచిగా కలిసి ఉన్నప్పటి రోజుల నుంచి సందర్భాన్ని బట్టి ఇప్పటివరకు ఏర్పడిన ఏర్పడిన పచ్చగడ్డి వేస్తే బగ్గున మండే పరిస్థితుల వరకు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో నైపుణ్యం నాణ్యత కలిగిన గ్రాఫిక్ డిజైనర్లు వ్యూహకతలకు భలే గిరాకి నడుస్తుంది. బీ ఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం మంత్రికి అనుకూలంగా, జానయ్య యాదవ్ బాధితులకు అండగా ఒకవైపు, మరోవైపు జానయ్య యాదవ్, అతనికి మద్దతుగా నిలిచిన వారు సోషల్ మీడియాలో పోటా పోటీగా పోస్టింగులు పెట్టుకుంటున్నారు.

జానయ్య యాదవ్ బాధితులకు సోషల్ మీడియా కూడా వేదికనే

ఇన్నాళ్లుగా తమ భూములను అక్రమంగా అన్యాయంగా జానయ్య యాదవ్ భయపెట్టి బెదిరించి దౌర్జన్యాలను చేసి తమను భూమి నుంచి వెళ్లగొట్టాడని ఆయన నుంచి తమకు ప్రాణాన్ని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడం రాస్తారోకోలు ధర్నాలు చేయడం తదితర అన్ని విషయాలను కూడా సోషల్ మీడియాలో జానయ్య యాదవ్ బాధితులు ప్రచారం చేస్తున్నారు.

సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్న జానయ్య యాదవ్ అనుకూల వర్గం

బీసీలను పార్టీలో ఎదగకుండా చేస్తున్నారని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని జానయ్య అనుకూల వర్గాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాయి. గాంధీనగర్ నుంచి బీ ఆర్ఎస్ కౌన్సిలర్, జానయ్య యాదవ్ సతీమణి వట్టే రేణుక, తదితరులు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ తీయడం ఏబీవీపీ బీఎస్పీ ఆధ్వర్యంలో మంత్రి క్యాంప్ ఆఫీస్ లో ముట్టడించడం, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన నాయకులు జానయ్య యాదవ్ కు మద్దతుగా మాట్లాడటం, ఆర్ కృష్ణయ్య జానయ్య యాదవ్ కు అనుకూలంగా మాట్లాడడం, జానయ్య యాదవ్ తల్లి సోదరి కూడా సోషల్ మీడియా వేదికగా తమ బాధను వెలి బుచ్చడం ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్రచార రంగంలో ఎంతగా దూసుకుపోతుందో చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది.

క్షణాల్లో చేరవేసే మాధ్యమం సోషల్ మీడియా

ఏదేమైనా అది మంచి జరిగినా చెడు జరిగినా అనుకూలమైనా ప్రతికూలమైనా పరస్పర ఆరోపణలు ప్రతి ఆరోపణలు వాగ్బాణాలు వ్యంగ్యాస్త్రాలు అవినీతిపై విమర్శలు అట్టడుగు వర్గాల ప్రజల పైసా ఖర్చు లేని మాధ్యమం సోషల్ మీడియా నేడు క్షణాల్లో విషయాన్ని ప్రజలకు చేరవేసి అందిస్తుంది. అయితే సోషల్ మీడియాతో వచ్చిన చిక్కేమిటంటే అబద్ధాలు అవాస్తవాలను కూడా అదే రేంజిలో ప్రచారం చేస్తుంది. అందుకే సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టేవారు పోస్టింగులు చదువుతున్న వారు కూడా నాణ్యత సామర్థ్యం నిజాయితీలతో మంచి విశేషణతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సూర్యాపేటలో మాత్రం మంత్రి జగదీశ్ రెడ్డి డి సి ఎం ఎస్ చైర్మన్ జానయ్య యాదవుల మధ్యన సోషల్ మీడియా వార్ కొనసాగుతుంది.