ఎన్టీఆర్ కు భారతరత్న కోసం పోస్ట్ కార్డు ఉద్యమం

ఎన్టీఆర్ కు భారతరత్న కోసం పోస్ట్ కార్డు ఉద్యమం

కోదాడ, ముద్ర:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మా మాజీ ముఖ్యమంత్రి నేషనల్ ఫ్రంట్ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు కు  అవార్డు కేంద్ర ప్రభుత్వం భారతరత్న వెంటనే ప్రకటించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు కోదాడ పట్టణంలో గురువారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవార్డులు అనేకమందికి అనేక విధాలుగా ప్రకటిస్తుందే గాని దేశ రాజకీయాలకు ప్రత్యేక గుర్తింపు,తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని , ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన ఆయన భారతరత్న అవార్డును  ప్రకటించడంలో ఎందుకు వెనకాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్చే  సారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ఎన్టీ రామారావు  పేరు మీద ప్రకటించకపోతే పోస్ట్ కార్డులు ఉద్యమంతో భారతరత్న అవార్డు వచ్చేంతవరకు పోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.