కామ్రేడ్ ఉస్తేలా వీరారెడ్డి విగ్రహావిష్కరణ బహిరంగ సభను జయప్రదం చేయండి.

కామ్రేడ్ ఉస్తేలా వీరారెడ్డి విగ్రహావిష్కరణ బహిరంగ సభను జయప్రదం చేయండి.

సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు.......

కోదాడ, ముద్ర:ఈనెల 25న చింతలపాలెం మండలంలో జరుగు తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ అమరజీవి ఉస్తేలా వీరారెడ్డి విగ్రహావిష్కరణ అనంతరం జరుగు బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులకుపిలుపునిచ్చారు.మంగళవారం కోదాడ పట్టణంలోని సిపిఐ కార్యాలయం భూపేష్ భవన్ లో జరిగిన కోదాడ నియోజకవర్గం జిల్లా కార్యవర్గ సమావేశంలోఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.పేద రైతు కుటుంబంలో జన్మించి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి సాయుధ పోరాటం నుండి మరణించేంతవరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక నిర్బంధాలను ఎదుర్కొని ప్రజా ప్రతినిధిగా, కమ్యూనిస్టు పార్టీ ముఖ్య నాయకుడిగా ఆ ప్రాంత రైతులకు, పేద ప్రజలకు అండగా ఉంటూ వందల ఎకరాలను పంచిపెట్టి ఆ ప్రాంతం అభివృద్ధి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి సమరశీల పోరాటాలు నిర్వహించిన గొప్ప నాయకుడని వారి ఆశయాలను నేటితరం యువత ఆదర్శంగా తీసుకొని ఎర్రజెండాను మోస్తూ ముందుకు సాగాలని తెలిపారు.కాగా ఈ కార్యక్రమానికిజాతీయ కార్యదర్శి కే. నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ. వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని. సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, హుజూర్నగర్ శాసనసభ్యులు సైదిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్న చంద్రశేఖర్, పాల్గొంటారని ఈ సభకు వేలాదిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో నాయకులు మేకల శ్రీనివాస్,మండవ వెంకటేశ్వర్లు,బతినేని హనుమంతరావు, బద్దం కృష్ణారెడ్డి, షేక్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.